బిసి కమీషన్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ..!
హైదరాబాద్ : అసెంబ్లీలో ఈరోజు బీసీ కమిషన్ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సభలో మంత్రి జోగు రామన్న బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరుగకుండా బీసీ కమిషన్ పనితీరు ఉండాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. దీనిపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ .. కసరత్తు అంతా చేశాకే కమిషనన్ ను నియమించామని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలన చేశామని సభకు తెలిపారు. చేతి వృత్తుల వారిని, కుల వృత్తులవారిని పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. తొలగించిన 26 కులాల గురించి విద్యా వెనుకబాటు తనాన్ని పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తుందని వివరించారు. పార్టీల కతీతంగా 54 శాతం ఉన్న బీసీ జనాభాకు న్యాయం జరగాలని కమిషన్ వేశామన్నారు. చర్చ తర్వాత సభ సవరణ బిల్లును ఆమోదించింది.
Tags: BC Commission Bill Amendment in Assembly, Bc, Assembly.
http://www.newspillar.com/post/BC-Commission-Bill-Amendment-in-Assembly

No comments:
Post a Comment