అన్నా మీ ఇంటికి భోజనానికి వస్తా ..!
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేసిన తర్వాత ఆయన కూర్చున్నారు. వెంటనే ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించారు.సీఎం భోజనం చేసి వచ్చినట్లున్నారు అనగానే సభలో నవ్వులు పూశాయి. ఆ తర్వాతే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రతిపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి భోజనం చేసే సాంప్రదాయం ఉండేదని ఆయన గుర్తు చేశారు. తను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్దామని ఓ సారి అనుకున్నాను కానీ అప్పుడు ఉపఎన్నిక రావడంతో లేనిపోని మాటలు వస్తాయని భావించి ఆలోచనను విరమించుకున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ సారి కచ్చితంగా జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళతానని,పప్పు పెట్టినా,పులుసు పెట్టినా సంతోషంగా భోజనం చేసి వస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు స్పీకర్ మధుసూధనాచారితో సహా సభ మొత్తం నవ్వుల్లో మునిగింది.
Tags: KCR Lunch With Janareddy, KCR, janareddy
http://www.newspillar.com/post/KCR-Lunch-With-Janareddy

No comments:
Post a Comment