Friday, January 6, 2017

                                            త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా కృష్ణంరాజు..!

చెన్నై : త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా బిజెపి సీనియ‌ర్ నేత .. కేంద్ర మాజీ మంత్రి .. ప్ర‌ముఖ సినీ న‌టుడు కృష్ణం రాజు నియ‌మించ‌బ‌డుతార‌ని తెలుస్తోంది. ఈ వార్త ఇప్ప‌టికే మీడియాలో హాల్ చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. గ‌త ఏడాది త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రోష‌య్య ప‌ద‌వీ కాలం పూర్థ‌వ్వ‌డంతో .. తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ గా మ‌హ‌రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.
ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడుకు పూర్తిస్థాయి గ‌వ‌ర్న‌ర్ నియామ‌కంపై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కృష్ణంరాజు పేరును సీరియ‌స్ గా ప‌రిశీలిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కృష్ణంరాజు తెలుగు సినీ న‌టుడుగా మంచి పేరుప్ర‌ఖ్యాతులు సంపాదించారు. బిజెపిలో వాజ్ పాయ్ స‌ర్కారులో కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం క్రీయాశీల‌కంగా రాజ‌కీయాలు చేయ‌క‌పోయినా పార్టీలో వివిధ హోదాల్లో ప‌ద‌వులు నిర్వ‌హిస్తున్నారు.
Tags: Telugu Film Acter And Ex Central Minister Krishnam Raju Going to become the Governor of Tamilnadu ,Krishnam raju, Krishnam Raju political Background.

http://www.newspillar.com/post/telugu-film-acter-and-ex-central-minister-krishnam-raju-going-to-become-the-governor-of-tamilnadu

Tuesday, January 3, 2017

                                                సంక్రాంతికి చిన్న‌మ్మే సీఎం ..!


చెన్నై :  త‌మిళుల చిన్న‌మ్మ శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించేందుకు ముహూర్థం ఖ‌రారైయ్యింది. ఈ నెల 12న ఆమె సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన పావులు చక‌ చ‌కా క‌దులుతున్నాయి. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టే అంశం ద‌గ్గ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు శ‌శిక‌ళ అన్నీ అడుగులు వ్యూహాత్మ‌కంగా వేస్తూ పోతున్నారు.
పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచే చిన్న‌మ్మ అన్నీ తానై న‌డిపిస్తున్నారు. ప్ర‌తి రోజు మంత్రులు .. ఎమ్మెల్యేలు .. చివ‌రికి ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం సైతం ఆమె ద‌గ్గ‌రికి వెళ్ళి రోజూ హ‌జ‌రువేయించుకుంటున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పార్టీలో అన్ని శ్రేణుల నుంచి చిన్న‌మ్మ కు సీఎం సీటు క‌ట్ట‌బెట్టాల‌నే వ‌త్తిడి తీసుకురావ‌డంలో శ‌శిక‌ళ వ‌ర్గం స‌క్సెస్స సాధించింది.
ఈ రోజు నుంచి గ్రామాల వారిగా శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి కావాలంటూ తీర్మానాలు చేసే కార్య‌క్ర‌మం ప్రారంభం కాబోతోంది. ఈ నెల 17 పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎంజీ రాంచంద్ర‌న్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు ఉన్న నేపథ్యంలో ఆలోపే చిన్న‌మ్మ సీఎం ప‌గ్గాలు చేప‌ట్టి .. ఆమె నేతృత్వంలో ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ఆమె వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తోంది.
Tags: Shashikala is Going to be Tamilnadu Chief Minister in this manth

Wednesday, December 28, 2016

                                      బిసి కమీషన్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ..!



హైదరాబాద్ : అసెంబ్లీలో ఈరోజు బీసీ కమిషన్ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సభలో మంత్రి జోగు రామన్న బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరుగకుండా బీసీ కమిషన్ పనితీరు ఉండాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. దీనిపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ .. కసరత్తు అంతా చేశాకే కమిషనన్‌ ను నియమించామని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలన చేశామని సభకు తెలిపారు. చేతి వృత్తుల వారిని, కుల వృత్తులవారిని పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. తొలగించిన 26 కులాల గురించి విద్యా వెనుకబాటు తనాన్ని పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తుందని వివరించారు. పార్టీల కతీతంగా 54 శాతం ఉన్న బీసీ జనాభాకు న్యాయం జరగాలని కమిషన్ వేశామన్నారు. చర్చ తర్వాత సభ సవరణ బిల్లును ఆమోదించింది. 

Tags: BC Commission Bill Amendment in Assembly, Bc, Assembly.

http://www.newspillar.com/post/BC-Commission-Bill-Amendment-in-Assembly
                                                    మోడీ ది తుగ్లక్ చర్య.. సురవరం

                                                                                  


విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్య అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలోమీడియాతో మాట్లాడిన సురవరం , మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత .. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మోడీకి కనబడటం లేదా అన్నారు. ఈ సమస్యలు మరో 6 నెలలు పాటు ఇలానే ఉంటాయన అన్నారు. అవినీతి పరులకు అండగా ఉండే మోడీకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు సురవరం. దేశంలో కార్పొరేట్ అనుకూల పాలన జరుగుతోందని బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టిన వారి బకాయిలు మోడీ ఎందుకు మాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: cpi suravaram sudhakar reddy comment on big notes ban, pm modi, rbi, vijayawada 

http://www.newspillar.com/post/cpi-suravaram-sudhakar-reddy-comment-on-big-notes-ban

Tuesday, December 27, 2016

                                              డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎటు పోయాయి..!

హైదరాబాద్ : ఎన్నికల్లో మీరు కట్టిస్తానన్న డబుల్ బెడ్ ఇండ్లు ఎటు పోయాయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే డీకే అరుణ. అసెంబ్లీలో గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలోని పేదల గృహా నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఎర్రవల్లి, నర్సన్నపేట్ లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టిన సర్కార్ కు .. మిగతా నియోజకవర్గాలు కనబడటం లేదా అని నిలదీశారు. సీఎం, కేటీఆర్,హరీష్ ల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల బకాయిలను ఎందుకు ప్రభుత్వం చెల్లించడం లేదని ప్రశ్నించిన డీకే అరుణ.. గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వేసిన సిబిసిఐడి రిపోర్ట్ ఎక్కడికెళ్ళిందని అన్నారు. ఈ సందర్బంగా టీఆరెస్ ఎమ్మెల్యే లు అడ్డు తగలడంపై డీకే మండిపడ్డారు. సభలో కూడా షి టీమ్స్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని చురకలు ఆంటించారు. 

Tags: dk aruna in assembly on double bedrooms debate, dk aruna, mla, assembly, speaker, indhiramma housing 

http://www.newspillar.com/post/dk-aruna--in-assembly-on-double-bedrooms-debate
                                                అన్నా మీ ఇంటికి భోజనానికి వస్తా ..! 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌పై చ‌ర్చ జరుగుతున్న సంద‌ర్భంలో ఒక్క‌సారిగా స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌పై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన త‌ర్వాత ఆయ‌న కూర్చున్నారు. వెంట‌నే ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.సీఎం భోజ‌నం చేసి వ‌చ్చిన‌ట్లున్నారు అన‌గానే స‌భ‌లో న‌వ్వులు పూశాయి. ఆ త‌ర్వాతే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత ఇంటికి ముఖ్య‌మంత్రి వెళ్లి భోజ‌నం చేసే సాంప్ర‌దాయం ఉండేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. త‌ను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జానారెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ్దామ‌ని ఓ సారి అనుకున్నాను కానీ అప్పుడు ఉపఎన్నిక రావ‌డంతో లేనిపోని మాట‌లు వ‌స్తాయ‌ని భావించి ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు. ఈ సారి క‌చ్చితంగా జానారెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ‌తాన‌ని,ప‌ప్పు పెట్టినా,పులుసు పెట్టినా సంతోషంగా భోజ‌నం చేసి వ‌స్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ప్పుడు స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారితో స‌హా స‌భ మొత్తం న‌వ్వుల్లో మునిగింది. 

Tags: KCR Lunch With Janareddy, KCR, janareddy

http://www.newspillar.com/post/KCR-Lunch-With-Janareddy
                                                        శ్రీనివాస్ గౌడ్ Vs జేసి

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, టీఆరెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మధ్య బస్సుల వివాదం ముదిరింది. ఈ వివాదం నేడు ఆర్టీఏ ఆఫీస్ కు చేరుకుంది. జేసి సవాల్ స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ ఆఫీస్ చేరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ తో పాటు వచ్చిన టీఆరెస్ కార్యకర్తలు జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దింతో ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిసవాళ్ళ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. జేసి చేసిన సవాళ్ళకు సాక్షాధారాలతో సహా వచ్చానని.. దీనిపై జేసి చర్చకు రావాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అయితే మరోవైపు ఇంటినుండి ఆర్టీఏ కార్యాలయానికి బయలుదేరిన జేసిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను గృహానిర్బంధం చేసినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇరు రాష్ట్రాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా సవాళ్ల తో రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది.

Tags: jc prabhakar reddy vs srinivasgoud, rta office, tdp, trs, private busses, diwakar travels 

http://www.newspillar.com/post/jc-prabhakar-reddy-vs-srinivasgoud