జయ మరణం వెనుక మిస్టరీ ఏంటీ ..!
చెన్నై : జయలలిత నిజంగానే గుండెపోటుతో మరణించిందా .. లేక మరేదైనా కారణం ఉందా .. ఇప్పుడు ఈ విషయంలో రాజకీయవర్గాల్లోనే కాదు .. సామాన్య జనంలో కూడా చాలా రకాల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అనుమానాలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది.
తీవ్రనారోగ్యంతో అపోలో హస్పిటల్ లో చేరిన జయలలిత ట్రీట్ మెంట్ పై రోజుకో రకమైన ప్రకటనలు అపోలో వైద్యుల నుంచి వెలువడటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. 74 రోజుల పాటు హస్పిటల్ లో చికిత్స పొందిన జయ .. చినిపోయే కొద్ది రోజుల ముందు అపోలో వైద్యుల నుంచి వచ్చిన ప్రకటన ఏంటీ .. అమ్మ పూర్తిగా కోలుకున్నారు .. ఎప్పుడు డిచ్చార్జీ కావాలనేది ఆమె నిర్ణయమే .. ఈ మాటలు చెప్పింది ఆసుపత్రి యాజమాన్యమే.
మరి మళ్ళీ ఏమైంది .. అమ్మకు సడన్ గా ఎందుకు గుండెపోటు వచ్చింది. జయ బుగ్గలపై రంద్రాలు ఏంటి ..ఏ ట్రీట్ మెంట్ కోసం ఆ రంద్రాలు చేశారు .. అనేవి శేష ప్రశ్నలుగా మిగిలిపోయాయి. సహజంగా ఆ రంద్రాలు చనిపోయాక ఎక్కువ రోజులు శవం కుళ్ళిపోకుండా ఉండేందుకు శరీరంలోని రక్తాన్ని తొలగించి .. రసాయనాలను శరీరంలోకి పంపేందుకు అలా రంద్రాలు చేస్తారని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. మరి అలా అయ్యితే .. అమ్మ ముందే చనిపోయిందా .. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారా .
అదే నిజమైతే అమ్మ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఐపిఎస్ అధికారి విజయ్ కుమార్ చేసిన ఆరోపణలు నిజమేనా అనే చర్చ మొదలైయ్యింది. విజయ్ కుమార్ చెప్పిన మాటల ప్రకారం .. జయ చనిపోయిందా .. లేక చంపబడిందా అనే అనుమానాలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. జయకు అందించిన చికిత్సపై అపోలో హస్పిటల్ వార్గాలు గోప్యత పాటించడం వెనుక ఎవరున్నారనేది బయటికి రావాలంటే సమగ్రవిచారణ జరగాల్సిందే.
Tags: Tamilnadu chief minister Jayalalitha Death Mistrey, Jayalalitha Death, Jayalalitha images, Jayalalitha pics, Jayalalitha political history, Jayalalitha films.
http://www.newspillar.com/post/tamilnadu-chief-minister-jayalalitha-death-mistrey
No comments:
Post a Comment