సంక్రాంతికి చిన్నమ్మే సీఎం ..!
చెన్నై : తమిళుల చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు ముహూర్థం ఖరారైయ్యింది. ఈ నెల 12న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పావులు చక చకా కదులుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టే అంశం దగ్గరి నుంచి ఇప్పటి వరకు శశికళ అన్నీ అడుగులు వ్యూహాత్మకంగా వేస్తూ పోతున్నారు.
పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే చిన్నమ్మ అన్నీ తానై నడిపిస్తున్నారు. ప్రతి రోజు మంత్రులు .. ఎమ్మెల్యేలు .. చివరికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం ఆమె దగ్గరికి వెళ్ళి రోజూ హజరువేయించుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలో అన్ని శ్రేణుల నుంచి చిన్నమ్మ కు సీఎం సీటు కట్టబెట్టాలనే వత్తిడి తీసుకురావడంలో శశికళ వర్గం సక్సెస్స సాధించింది.
ఈ రోజు నుంచి గ్రామాల వారిగా శశికళ ముఖ్యమంత్రి కావాలంటూ తీర్మానాలు చేసే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ నెల 17 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రాంచంద్రన్ శతజయంతి ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో ఆలోపే చిన్నమ్మ సీఎం పగ్గాలు చేపట్టి .. ఆమె నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహించాలని ఆమె వర్గం ప్రయత్నిస్తోంది.
Tags: Shashikala is Going to be Tamilnadu Chief Minister in this manth
No comments:
Post a Comment