విపక్షాలను అసెంబ్లీలో ఉతికి ఆరే స్తా
మెదక్ : ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలను ఉతికి ఆరేస్తామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. సింగూరు ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత మంత్రి హరీశ్ రావు బహిరంగసభలో పాల్గొన్నారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి మొత్తం 48 వేల ఎకరాలకు గాను ప్రస్తుతం 40 వేల ఎకరాలకు నీరందిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. త్వరలో మిగతా 8 వేల ఎకరాలకు కూడా సాగునీరందుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలకులు 8 ఏళ్లలో 56 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్ ఎస్ రెండేళ్లలో నే 50 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 8 ఏళ్ళలో కాంగ్రెస్ 83 కిలోమీటర్ల కాలువలు తవ్వితే... టీఆర్ఎస్ రెండేళ్లలో 80 కిలోమీటర్ల కాలువలు తవ్వినట్లు చెప్పారు. కొంత మంది నేతలు ఎంతో గొప్ప పదవులు అనుభవించారు తప్ప తెలంగాణకు వాళ్ళు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్, టిడిపిల బండారం బయటపెట్టి... అసెంబ్లీ సమావేశాల్లో వాళ్లను కడిగి పారేస్తా. సబ్బుతో ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు.
Tags: Minister Harish Rao warning to congress tdp leaders, singuru praject inagration, assembly winter session, Harish Rao speech, Harish Rao comments
http://www.newspillar.com/post/minister-harish-rao-warning-to-congress-tdp-leaders

No comments:
Post a Comment