Wednesday, December 28, 2016

                                      బిసి కమీషన్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ..!



హైదరాబాద్ : అసెంబ్లీలో ఈరోజు బీసీ కమిషన్ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సభలో మంత్రి జోగు రామన్న బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరుగకుండా బీసీ కమిషన్ పనితీరు ఉండాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. దీనిపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ .. కసరత్తు అంతా చేశాకే కమిషనన్‌ ను నియమించామని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలన చేశామని సభకు తెలిపారు. చేతి వృత్తుల వారిని, కుల వృత్తులవారిని పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. తొలగించిన 26 కులాల గురించి విద్యా వెనుకబాటు తనాన్ని పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తుందని వివరించారు. పార్టీల కతీతంగా 54 శాతం ఉన్న బీసీ జనాభాకు న్యాయం జరగాలని కమిషన్ వేశామన్నారు. చర్చ తర్వాత సభ సవరణ బిల్లును ఆమోదించింది. 

Tags: BC Commission Bill Amendment in Assembly, Bc, Assembly.

http://www.newspillar.com/post/BC-Commission-Bill-Amendment-in-Assembly
                                                    మోడీ ది తుగ్లక్ చర్య.. సురవరం

                                                                                  


విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్య అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలోమీడియాతో మాట్లాడిన సురవరం , మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత .. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మోడీకి కనబడటం లేదా అన్నారు. ఈ సమస్యలు మరో 6 నెలలు పాటు ఇలానే ఉంటాయన అన్నారు. అవినీతి పరులకు అండగా ఉండే మోడీకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు సురవరం. దేశంలో కార్పొరేట్ అనుకూల పాలన జరుగుతోందని బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టిన వారి బకాయిలు మోడీ ఎందుకు మాఫీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: cpi suravaram sudhakar reddy comment on big notes ban, pm modi, rbi, vijayawada 

http://www.newspillar.com/post/cpi-suravaram-sudhakar-reddy-comment-on-big-notes-ban

Tuesday, December 27, 2016

                                              డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎటు పోయాయి..!

హైదరాబాద్ : ఎన్నికల్లో మీరు కట్టిస్తానన్న డబుల్ బెడ్ ఇండ్లు ఎటు పోయాయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే డీకే అరుణ. అసెంబ్లీలో గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలోని పేదల గృహా నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఎర్రవల్లి, నర్సన్నపేట్ లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టిన సర్కార్ కు .. మిగతా నియోజకవర్గాలు కనబడటం లేదా అని నిలదీశారు. సీఎం, కేటీఆర్,హరీష్ ల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులను పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల బకాయిలను ఎందుకు ప్రభుత్వం చెల్లించడం లేదని ప్రశ్నించిన డీకే అరుణ.. గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని వేసిన సిబిసిఐడి రిపోర్ట్ ఎక్కడికెళ్ళిందని అన్నారు. ఈ సందర్బంగా టీఆరెస్ ఎమ్మెల్యే లు అడ్డు తగలడంపై డీకే మండిపడ్డారు. సభలో కూడా షి టీమ్స్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని చురకలు ఆంటించారు. 

Tags: dk aruna in assembly on double bedrooms debate, dk aruna, mla, assembly, speaker, indhiramma housing 

http://www.newspillar.com/post/dk-aruna--in-assembly-on-double-bedrooms-debate
                                                అన్నా మీ ఇంటికి భోజనానికి వస్తా ..! 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌పై చ‌ర్చ జరుగుతున్న సంద‌ర్భంలో ఒక్క‌సారిగా స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌పై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన త‌ర్వాత ఆయ‌న కూర్చున్నారు. వెంట‌నే ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డి ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.సీఎం భోజ‌నం చేసి వ‌చ్చిన‌ట్లున్నారు అన‌గానే స‌భ‌లో న‌వ్వులు పూశాయి. ఆ త‌ర్వాతే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత ఇంటికి ముఖ్య‌మంత్రి వెళ్లి భోజ‌నం చేసే సాంప్ర‌దాయం ఉండేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. త‌ను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జానారెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ్దామ‌ని ఓ సారి అనుకున్నాను కానీ అప్పుడు ఉపఎన్నిక రావ‌డంతో లేనిపోని మాట‌లు వ‌స్తాయ‌ని భావించి ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు. ఈ సారి క‌చ్చితంగా జానారెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ‌తాన‌ని,ప‌ప్పు పెట్టినా,పులుసు పెట్టినా సంతోషంగా భోజ‌నం చేసి వ‌స్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ప్పుడు స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారితో స‌హా స‌భ మొత్తం న‌వ్వుల్లో మునిగింది. 

Tags: KCR Lunch With Janareddy, KCR, janareddy

http://www.newspillar.com/post/KCR-Lunch-With-Janareddy
                                                        శ్రీనివాస్ గౌడ్ Vs జేసి

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, టీఆరెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మధ్య బస్సుల వివాదం ముదిరింది. ఈ వివాదం నేడు ఆర్టీఏ ఆఫీస్ కు చేరుకుంది. జేసి సవాల్ స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ ఆఫీస్ చేరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ తో పాటు వచ్చిన టీఆరెస్ కార్యకర్తలు జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దింతో ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతిసవాళ్ళ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. జేసి చేసిన సవాళ్ళకు సాక్షాధారాలతో సహా వచ్చానని.. దీనిపై జేసి చర్చకు రావాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అయితే మరోవైపు ఇంటినుండి ఆర్టీఏ కార్యాలయానికి బయలుదేరిన జేసిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను గృహానిర్బంధం చేసినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇరు రాష్ట్రాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇలా సవాళ్ల తో రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది.

Tags: jc prabhakar reddy vs srinivasgoud, rta office, tdp, trs, private busses, diwakar travels 

http://www.newspillar.com/post/jc-prabhakar-reddy-vs-srinivasgoud

Friday, December 23, 2016

                                             255 పార్టీలను రద్దు చేసిన ఎన్నికల కమిషన్

ఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలుగా ఉంటూ ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న పార్టీలకు ఖటిఫ్ చెప్పింది. దేశ వ్యాప్తంగా 255 రాజకీయపార్టీల గుర్తింపును రద్దు చేస్తూ సిఈసీ ప్రకటన విడుదల చేసింది. 2005 నుంచి 2015 మధ్య కాలంలో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 12 పార్టీలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన ‘అన్నా తెలుగుదేశం’ పార్టీతో పాటు.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్థాపించిన ‘ఎన్టీఆర్ తెలుగు దేశం’ పార్టీ కూడా ఉంది. ఈ రెండు పార్టీలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని సీఈసీ రద్దు చేసిన పార్టీలు ఇలా ఉన్నాయి... * ఆల్ ఇండియా సద్గుణ పార్టీ * ఆంధ్రనాడు పార్టీ * అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ) * బహుజన రిపబ్లికన్ పార్టీ * భారతీయ సేవాదళ్ * జై తెలంగాణ పార్టీ * ముదిరాజ్ రాష్ట్రీయ సమితి * నేషనల్ సిటిజన్స్ పార్టీ * ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి) * సత్యయుగ్ పార్టీ * తెలంగాణ కాంగ్రెస్ పార్టీ * తెలంగాణ ప్రజా పార్టీ .

Tags: central election commission cancelled some political party recognition, cec, anna tdp. ntr tdp, political partys .

http://www.newspillar.com/post/central-election-commission-cancelled-some-political-party-recognition
                                                హరితహారంలో అంతా గోల్ మాల్ ..!

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రోగ్రామ్ లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు మండలి డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. హెచ్ఎండీఏ .. జీహెచ్ఎంసీ పరిధిలో హరితహారం పూర్తిగా అవినీతిమయమైయ్యిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఈ గోల్ మాల్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనమండలి లో హరితహారంపై జరిగిన చర్చలో మాట్లాడిన పొంగులేటి .. వచ్చే ఎండాకాలంలో మొక్కలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. హరితహారం మంచి కార్యక్రమమం అయినా సర్కార్ చర్యలు అంత సీరియస్ నెస్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న హరితహారం అవార్డు పేరును .. అశోకమిత్ర అవార్డుగా మార్చాలన్నారు. 

Tags: Ponguleti Sudhakar Reddy Haritha Haram Speech in Telangana Council , ponguleti speech, ponguleti punches
http://www.newspillar.com/post/Ponguleti-Sudhakar-Reddy-Haritha-Haram-Speech-in-Telangana-Council

Wednesday, December 21, 2016

                                                ఆయ‌న ఇంట్లో ఎంత దొరికిందో తెలుసా..?



చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంటిపై జ‌రిగిన ఐటీ దాడుల్లో ఎంత బంగారు .. ఎంత కొత్త క‌రెన్సీ దొరికిందో తెలుసా ..  చెన్నై  అన్నానగర్‌ లోని ఆయన నివాసంతోపాటు మరో ఆరు చోట్ల దాడులు జ‌రిగిన విష‌యం తెల్సిందే క‌దా. ఈ దాడుల్లో  18 లక్షల కొత్త నోట్లు .. 2 కేజీల బంగారం లభించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. రామ్మోహనరావు కొడుకు .. స‌మీప‌ బంధువుల ఇళ్లలో ఈ మొత్తం లభించినట్టు సమాచారం.
టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇళ్ళు .. కార్యాలయాలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. అక్కడ లభించిన పత్రాల్లో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు కనిపించడంతో ఐటీ అధికారులు త‌మ దృష్టిని చీఫ్ సెక్రేట‌రీపైకి మ‌ళ్ళించారు. ఈ నేపథ్యంలో రామ్మోహ‌న్ రావుకు సమన్లు జారీ చేసి ఈ ఐటీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. 
Tags: IT Rides on Tamilnadu Chief Secretary Rammohan Rao House 

http://www.newspillar.com/post/it-rides-on-tamilnadu-chief-secretary-rammohan-rao-house

Monday, December 19, 2016

                                   కేసీఆర్ చెప్పిన నయిమ్ ఆస్తులు ఎన్నో తెలుసా... ?

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయిమ్ ఆస్తులు, అక్రమాలు, కబ్జాల పై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. నయిమ్ కేసుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కేసీఆర్ మాట్లాడారు. 2 కోట్ల 95 లక్షలు నగదు, లక్ష 75 వేల గజాల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం స్వాదినం చేసుకుందని కేసీఆర్ అన్నారు. నయిమ్ పై 174 కేసులు నమోదు అయ్యాయని .. 29 హత్యకేసులో నిందుతడని తెలిపారు. 21 తుపాకులు, 26 కార్లు, 26 నయిమ్ కు చెందిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీఎం చెప్పారు. ఇప్పటికే 2 చార్జ్ షీట్ దాఖలు చేశారన్న ముఖ్యమంత్రి కేసీఆర్.., త్వరలోనే మరో15 చార్జ్ షీట్ల ను న్యాయ స్థానానికి దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

Tags: Cm Kcr Announce gangster nayeem assets, gangster nayeem encounter, nayeem issue in assembly,KCR talck about Nayeem, nayeem, kcr.
http://www.newspillar.com/post/Cm-Kcr-Announce-gangster-nayeem-assets

Friday, December 9, 2016

                                                       టీడీపీలో 50-50 పోరు..


పొలిటికల్ డెస్క్- ఉన్నది ఒక పోస్టు.. దానికి ఇద్దరు పోటీ పడుతోంటే.. ఏంచేయాలి.. ఆ పోస్టు పదవీ కాలాన్ని ఇద్దరికి చెరిసగం పంచాలి. ఈ ఫార్ములాను  దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి ఫాలో అయ్యేవారు. స్థానిక సంస్థ‌లకు సంబంధించి త‌మ పార్టీ నాయ‌కులు ఓకే కుర్చీ కోసం ఒకరికి మించి పోటీప‌డితే రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి ఇద్ద‌రిని సంతృప్తి ప‌రిచేందుకు ఆ ప‌ద‌వీ కాలాన్ని చెరి స‌గ కాలం పంచేవారు. 
ఇక ఇప్పుడు అధికార టీడీపీలోను ప‌ద‌వుల కోసం వంతులేసుకుని మ‌రీ పోటీప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే స్థానిక నాయ‌కుల‌కు స‌ర్ది చెప్పేందుకు ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌ ఛార్జ్‌ ల‌కు త‌ల ప్రాణం తోక‌మీద‌కు వ‌స్తోంది. ఈ నేపధ్యంలోనే ఈ 50-50 ప‌ద‌వుల పందేరం విష‌యం ఇప్పుడు టీడీపీలో గ్రూపుల‌కు, గొడ‌వ‌ల‌కు ఆజ్యం పోస్తోంది. స‌గం ప‌ద‌వీ కాలం పూర్త‌యిన వెంట‌నే ప‌ద‌విని వ‌దులుకోవాల్సిన వ‌ర్గం వారు అందుకు నో చెప్ప‌డంతో రెండో వ‌ర్గం నేత‌ల‌కు, ముందు ప‌ద‌వి చేప‌ట్టిన వ‌ర్గం నేత‌ల మ‌ధ్య తగాదా మొదలవుతోంది
న‌వ్యాంధ్ర రాజ‌ధాని విస్త‌రించి ఉన్న గుంటూరు జిల్లా టీడీపీలో ఈ టైప్ విబేధాలు పార్టీ ప‌రువును బ‌జారు కీడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచ‌ర్ల మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్‌ గా కొన‌సాగిన శ్రీదేవి ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేందుకు స‌సేమీరా అన్నారు. ఆమెను బ‌ల‌వంతంగా టీడీపీలోని మ‌రోవ‌ర్గం ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. ఆ త‌ర్వాత ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 
తాజాగా బాప‌ట్ల ఎంపీపీ వంతు వ‌చ్చింది. ఇక్క‌డ రాజీ ఫార్ములాలో భాగంగా మానం విజేత‌… తొలి రెండున్న‌రేళ్ల పాటు ఎంపీపీగా ఎంపిక‌య్యారు. ఇప్పుడు రెండున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలం ముగిసింది. అయితే ఇప్పుడు విజేత త‌న‌కు రెండ‌న్న‌రేళ్లు మాత్ర‌మే ప‌ద‌వి ఇస్తాన‌ని ఎవ్వ‌రూ చెప్ప‌లేద‌ని..తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌న‌ని అంటోంది. మ‌రో వ‌ర్గం మాత్రం విజేత త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందేన‌ని గొడ‌వ‌కు దిగారు. దీంతో ఆమెకు గుండెపోటు వ‌చ్చింది. జిల్లాలో ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఇదే ర‌క‌మైన ప‌రిస్థితి ఉంది.
http://www.newspillar.com/post/tdp-internal-political-war
                                              విపక్షాలను అసెంబ్లీలో ఉతికి ఆరే స్తా 


మెద‌క్ : ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షాల‌ను ఉతికి ఆరేస్తామ‌ని మంత్రి హ‌రీష్ రావు హెచ్చ‌రించారు. సింగూరు ప్రాజెక్టును ప్రారంభించిన త‌రువాత మంత్రి హరీశ్ రావు బహిరంగసభలో పాల్గొన్నారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి మొత్తం 48 వేల ఎకరాలకు గాను ప్రస్తుతం 40 వేల ఎకరాలకు నీరందిస్తున్న‌ట్లు హ‌రీష్ రావు చెప్పారు. త్వరలో మిగతా 8 వేల ఎకరాలకు కూడా సాగునీరందుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలకులు 8 ఏళ్లలో 56 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్ ఎస్‌ రెండేళ్లలో నే 50 కోట్లు ఖర్చు చేసిన‌ట్లు చెప్పారు. 8 ఏళ్ళలో కాంగ్రెస్ 83 కిలోమీటర్ల కాలువలు త‌వ్వితే... టీఆర్ఎస్‌ రెండేళ్లలో 80 కిలోమీటర్ల కాలువ‌లు త‌వ్విన‌ట్లు చెప్పారు. కొంత మంది నేత‌లు ఎంతో గొప్ప పదవులు అనుభవించారు త‌ప్ప‌ తెలంగాణకు వాళ్ళు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్, టిడిపిల బండారం బయటపెట్టి... అసెంబ్లీ సమావేశాల్లో వాళ్లను కడిగి పారేస్తా. సబ్బుతో ఉతికి ఆరేస్తామ‌ని హెచ్చ‌రించారు.
Tags: Minister Harish Rao warning to congress tdp leaders, singuru praject inagration, assembly winter session, Harish Rao speechHarish Rao comments

http://www.newspillar.com/post/minister-harish-rao-warning-to-congress-tdp-leaders

Thursday, December 8, 2016

                                               జ‌య మ‌ర‌ణం వెనుక మిస్టరీ ఏంటీ ..!


చెన్నై :  జ‌య‌ల‌లిత నిజంగానే గుండెపోటుతో మ‌ర‌ణించిందా .. లేక మ‌రేదైనా కార‌ణం ఉందా .. ఇప్పుడు ఈ విష‌యంలో రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాదు .. సామాన్య జ‌నంలో కూడా చాలా ర‌కాల అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు త‌మ అనుమానాల‌ను ప్ర‌శ్న‌ల రూపంలో సంధిస్తున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగింది.
తీవ్రనారోగ్యంతో అపోలో హ‌స్పిట‌ల్ లో చేరిన జ‌య‌ల‌లిత ట్రీట్ మెంట్ పై రోజుకో ర‌క‌మైన ప్ర‌క‌ట‌న‌లు అపోలో వైద్యుల నుంచి వెలువ‌డ‌టం కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. 74 రోజుల పాటు హ‌స్పిట‌ల్ లో చికిత్స పొందిన జ‌య .. చినిపోయే కొద్ది రోజుల ముందు అపోలో వైద్యుల నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌న ఏంటీ .. అమ్మ పూర్తిగా కోలుకున్నారు .. ఎప్పుడు డిచ్చార్జీ కావాల‌నేది ఆమె నిర్ణ‌య‌మే .. ఈ మాట‌లు చెప్పింది ఆసుప‌త్రి యాజ‌మాన్యమే.
మ‌రి మ‌ళ్ళీ ఏమైంది .. అమ్మ‌కు స‌డ‌న్ గా ఎందుకు గుండెపోటు వ‌చ్చింది. జ‌య బుగ్గ‌ల‌పై రంద్రాలు ఏంటి ..ఏ ట్రీట్ మెంట్ కోసం ఆ రంద్రాలు చేశారు .. అనేవి శేష ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయాయి. స‌హ‌జంగా ఆ రంద్రాలు చ‌నిపోయాక ఎక్కువ రోజులు శ‌వం కుళ్ళిపోకుండా ఉండేందుకు శ‌రీరంలోని ర‌క్తాన్ని తొల‌గించి .. ర‌సాయ‌నాల‌ను శ‌రీరంలోకి పంపేందుకు అలా రంద్రాలు చేస్తార‌ని కొంద‌రు డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌రి అలా అయ్యితే .. అమ్మ ముందే చ‌నిపోయిందా .. ఆ విష‌యాన్ని గోప్యంగా ఉంచారా .
అదే నిజ‌మైతే అమ్మ ద‌గ్గ‌ర సెక్యూరిటీ ఆఫీస‌ర్ గా ప‌నిచేసిన ఐపిఎస్ అధికారి విజ‌య్ కుమార్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మేనా అనే చ‌ర్చ మొద‌లైయ్యింది. విజ‌య్ కుమార్ చెప్పిన మాట‌ల ప్ర‌కారం .. జ‌య చ‌నిపోయిందా  .. లేక చంప‌బ‌డిందా అనే అనుమానాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తిరేపుతున్నాయి. జ‌య‌కు అందించిన చికిత్స‌పై అపోలో హ‌స్పిట‌ల్ వార్గాలు గోప్య‌త పాటించ‌డం వెనుక ఎవ‌రున్నార‌నేది బ‌య‌టికి రావాలంటే స‌మ‌గ్ర‌విచార‌ణ జ‌ర‌గాల్సిందే.
http://www.newspillar.com/post/tamilnadu-chief-minister-jayalalitha-death-mistrey