టీడీపీలో 50-50 పోరు..
పొలిటికల్ డెస్క్- ఉన్నది ఒక పోస్టు.. దానికి ఇద్దరు పోటీ పడుతోంటే.. ఏంచేయాలి.. ఆ పోస్టు పదవీ కాలాన్ని ఇద్దరికి చెరిసగం పంచాలి. ఈ ఫార్ములాను దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫాలో అయ్యేవారు. స్థానిక సంస్థలకు సంబంధించి తమ పార్టీ నాయకులు ఓకే కుర్చీ కోసం ఒకరికి మించి పోటీపడితే రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని సంతృప్తి పరిచేందుకు ఆ పదవీ కాలాన్ని చెరి సగ కాలం పంచేవారు.
ఇక ఇప్పుడు అధికార టీడీపీలోను పదవుల కోసం వంతులేసుకుని మరీ పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక నాయకులకు సర్ది చెప్పేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లకు తల ప్రాణం తోకమీదకు వస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈ 50-50 పదవుల పందేరం విషయం ఇప్పుడు టీడీపీలో గ్రూపులకు, గొడవలకు ఆజ్యం పోస్తోంది. సగం పదవీ కాలం పూర్తయిన వెంటనే పదవిని వదులుకోవాల్సిన వర్గం వారు అందుకు నో చెప్పడంతో రెండో వర్గం నేతలకు, ముందు పదవి చేపట్టిన వర్గం నేతల మధ్య తగాదా మొదలవుతోంది
నవ్యాంధ్ర రాజధాని విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా టీడీపీలో ఈ టైప్ విబేధాలు పార్టీ పరువును బజారు కీడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగిన శ్రీదేవి పదవి నుంచి తప్పుకునేందుకు ససేమీరా అన్నారు. ఆమెను బలవంతంగా టీడీపీలోని మరోవర్గం పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా బాపట్ల ఎంపీపీ వంతు వచ్చింది. ఇక్కడ రాజీ ఫార్ములాలో భాగంగా మానం విజేత… తొలి రెండున్నరేళ్ల పాటు ఎంపీపీగా ఎంపికయ్యారు. ఇప్పుడు రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే ఇప్పుడు విజేత తనకు రెండన్నరేళ్లు మాత్రమే పదవి ఇస్తానని ఎవ్వరూ చెప్పలేదని..తాను తన పదవికి రాజీనామా చేయనని అంటోంది. మరో వర్గం మాత్రం విజేత తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని గొడవకు దిగారు. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చింది. జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది.
Tags: tdp internal political war, ap tdp internal political war, tdp internal political fight, tdp internal political issues, tdp party, tdp, tdp political issues,chandrababu speech on tdp meeting.
http://www.newspillar.com/post/tdp-internal-political-war
No comments:
Post a Comment