తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు..!
http://www.newspillar.com/post/telugu-film-acter-and-ex-central-minister-krishnam-raju-going-to-become-the-governor-of-tamilnadu
చెన్నై : తమిళనాడు గవర్నర్ గా బిజెపి సీనియర్ నేత .. కేంద్ర మాజీ మంత్రి .. ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు నియమించబడుతారని తెలుస్తోంది. ఈ వార్త ఇప్పటికే మీడియాలో హాల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గత ఏడాది తమిళనాడు గవర్నర్ గా రోషయ్య పదవీ కాలం పూర్థవ్వడంతో .. తాత్కాలిక గవర్నర్ గా మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు బాద్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కృష్ణంరాజు పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కృష్ణంరాజు తెలుగు సినీ నటుడుగా మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. బిజెపిలో వాజ్ పాయ్ సర్కారులో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం క్రీయాశీలకంగా రాజకీయాలు చేయకపోయినా పార్టీలో వివిధ హోదాల్లో పదవులు నిర్వహిస్తున్నారు.
Tags: Telugu Film Acter And Ex Central Minister Krishnam Raju Going to become the Governor of Tamilnadu ,Krishnam raju, Krishnam Raju political Background.http://www.newspillar.com/post/telugu-film-acter-and-ex-central-minister-krishnam-raju-going-to-become-the-governor-of-tamilnadu

No comments:
Post a Comment